గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుపై రైతుల్లో ఆందోళన

0
26

ఈ ఏడాది రబీ ప్రారంభంలోనే గోదావరి నదిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం డెల్టా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. డెల్టాలో రబీలో పంటల సాగుకు కనిష్టంగా 90 టీఎంసీలు అవసరం. సీలేరు నదిపై నిర్మించిన రిజర్వాయర్లలో 30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో సహజ సిద్ధంగా ఉండే ప్రవాహాల నుంచి 60 టీఎంసీలు వస్తే డెల్టాలో రబీ పంటలు చేతికందుతాయి. కానీ.. డిసెంబర్‌ ప్రారంభంలోనే గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో.. డ్రైయిన్‌ల నుంచి నీటిని ఎత్తిపోసినా 60 టీఎంసీల నీటి లభ్యత అసాధ్యమని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

LEAVE A REPLY