గొర్రెలు, పాడి సంపదతో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలె.. ఉన్నతస్థాయి సమీక్షలో

0
21

తెలంగాణ రాష్ట్రం పాడి పశుసంపద, మత్స్యసంపదతో విరాజిల్లాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి చెరువు చేపల పెంపకానికి ఆదెరువు కావాలని, గొర్రెలు, పాడి, పశుసంపదతో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలని సీఎం అన్నారు. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగా మత్స్యపరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రభుత్వం తీసుకువస్తున్న జలవిప్లవంతో రాష్ట్రంలోని 45వేల చెరువుల్లో ఏడాది పొడవునా జలకళ ఉట్టిపడనున్న నేపథ్యంలో ప్రతి చెరువు ఒక చేపల పెంపకం కేంద్రంగా మారాలని సీఎం చెప్పారు. ఫిషరీస్ కళాశాలలు, చేపల ఫీడ్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ప్రణాళికలు వేయాలని, గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉధృతం చేయాలని ఆదేశించారు

LEAVE A REPLY