గేల్ జిగేల్

0
25

పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పైచేయి సాధించింది. క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌కు కోహ్లీ (50 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా స్పందించడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 21 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలిచింది. ముందుగా ఆర్‌సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో ట్రెవిస్ హెడ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (44 బంతుల్లో 72; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేయగా, ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 39) ఆకట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here