గృహ నిర్బంధంలో హఫీజ్ సయీద్

0
19

ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు, జమ్మత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. లాహోర్ పోలీసులు అతడిని తన సంస్థ ప్రధాన కార్యాలయంలోనే నిర్బంధంలో ఉంచారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే హఫీజ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తున్నది. జేయూడీ భారత్‌లోని ముంబై సహా అనేక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టు ఆధారాలున్నాయి.

LEAVE A REPLY