గురుకులాల్లో జూనియర్ కాలేజీలు

0
30

వచ్చే విద్యాసంవత్సరంనుంచి గురుకులాల్లో జూనియర్ కాలేజీ తరగతులు ప్రారంభిస్తామని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లను దేశంలోనే ఆదర్శంగా నిలుపాలని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు లీడర్ మీట్- 2016 కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరంనుంచి జూనియర్ కాలేజీ తరగతులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం అవసరమైన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వివరించారు. అలాగే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలతో విద్యార్థులకు పాఠాలు బోధించేలా సబ్జెక్టు టీచర్లకు నిత్యం శిక్షణ ఇచ్చేందుకు ఒక ప్రత్యేక టీచర్ ట్రైనింగ్ (టీ)ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్ల లీడర్ మీట్- 2016 కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభించారు. గురుకులాల్లో మౌలిక వసతి సదుపాయాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని కడియం చెప్పారు. తెలంగాణలో చదివిన విద్యార్థులు దేశంలో ఏ పరీక్షలనైనా ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఈ దిశగా రాష్ట్రంలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లను కేంద్రీయ, నవోదయ విద్యాలయాలకన్నా మిన్నగా తీర్చిదిద్దాలని, ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా కృషి చేయాలని కోరారు. గురుకులాల అభివృద్ధికి రూ.100 కోట్లు, మోడల్ స్కూళ్లకు రూ.100 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here