గుజరాత్‌తో జార్ఖండ్ అమీతుమీ.. నేటి నుంచి రంజీ సెమీ ఫైనల్స్

0
21

రంజీ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా లీగ్ దశతో అలరించిన రంజీలో సెమీఫైనల్స్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. కప్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తమిళనాడుతో ముంబై, జార్ఖండ్‌తో గుజరాత్ వేర్వేరు సెమీస్‌ల్లో తలపడనున్నాయి. రంజీ చరిత్రలోనే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ దక్కించుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై..మరోసారి ఫైనల్ బెర్తుపై కన్నేసింది. ఆదివారం నుంచి మొదలయ్యే సెమీస్‌లో రెండు సార్లు చాంపియన్ తమిళనాడును ముంబై ఎదుర్కొనుంది. క్వార్టర్స్‌లో హైదరాబాద్‌పై అద్భుత విజయంతో ముంబై సెమీస్ పోరుకు అర్హత సాధించింది. జట్టులో కెప్టెన్ ఆదిత్య తారెతో పాటు శ్రేయాస్ అయ్యర్, సిద్ధార్థ్ లాడ్ లాంటి బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్‌మీదున్నారు.

LEAVE A REPLY