గుండెపోటుకు గురైన ఎంపీ కన్నుమూత

0
37

పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఐయూఎంఎల్‌ ఎంపీ ఇ. అహ్మద్‌(78) కన్నుమూశారు. దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం సమయంలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వెనక వరుసలోని సీట్లో కూర్చున్న అహ్మద్‌ స్పృహ తప్పిపడిపోయారు. రాష్ట్రపతి వైద్య బృందంలోని వైద్యులు ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందించి రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ, రైల్వే శాఖల సహాయ మంత్రిగా అహ్మద్‌ పనిచేశారు. ప్రస్తుతం కేరళలోని మలప్పురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here