గుంటూరోడికి తాకిన స్పెషల్ స్టేటస్ ఉద్యమ సెగ

0
16

26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే ప్రత్యేక హోదా సాధన నిరసన కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు కదిలి రావాలని సినీ తారలు పిలుపునివ్వడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశం ట్రెండింగ్ గా మారడంతో అందరి దృష్టి జనవరి 26 పైనే ఉంది. తమిళనాడు లో జల్లికట్టు ఆందోళన వలన సూర్య నటించిన సింగం 3 వాయిదా పడగా, విశాఖలో జరగనున్న ఏపి డిమాండ్ స్పెషల్ స్టేటస్ నిరసన కార్యక్రమం వలన తన తాజా చిత్రం గుంటూరోడు ఆడియో వేడుక కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు మనోజ్ తెలిపాడు. జనవరి 26న చిత్ర ఆడియో వేడుకని నిర్వహించాలని టీం ముందుగానే భావించిన అదే రోజు నిరసన కార్యక్రమం ఉండడంతో వారికి మద్దతుగా తమ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మనోజ్ తెలిపాడు. మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గుంటూరోడు చిత్రాన్ని ఎస్కే సత్య తెరకెక్కించగా ఇందులో రావు రమేష్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు.

LEAVE A REPLY