గుంటూరు మిర్చిలో కల్తీ నిజమే..

0
21

గుంటూరు కారం కల్తీ అయినట్టు రుజువయింది. మిర్చిపొడిలో విషపూరిత పదార్థాలు కలిసినట్టు నిర్ధారణ అయింది. భువనేశ్వరి ఇండసీ్ట్ర్‌సలో సేకరించిన నాలుగు నమూనాల్లోనూ రోడోమిన బీ, సుడాన, రెడాక్సైడ్‌ రసాయనాలు ఉన్నట్లు హైదరాబాద్‌ ల్యాబ్‌ అధికారులు తేల్చారు. మిరపకాయల్లో ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు. మిగతా 75 నమూనాల ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా అందిస్తామని తెలిపారు. భువనేశ్వరి ఇండసీ్ట్రస్‌ యజమాని అంబటి కాశీవిశ్వనాథంపై క్రిమినల్‌ చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. కల్తీ బాబులపై ఆహార భద్రతాచట్టం ప్రయోగించి, కఠిన చర్యలు తీసుకొంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు. గుంటూరులో వరుసగా మూడో రోజూ అధికారుల బృందాలు కారం మిల్లులు, శీతల గిడ్డంగులపై దాడులు కొనసాగించాయి. ముప్పేట దాడులతో 40 వేల కల్తీ కారం బస్తాలను అధికారులు సీజ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here