గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న గుట్కా మాఫియా

0
46

పాన్ మసాలాల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం 2013లో నిషేదం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుట్కాలను నిషేధించిన ప్రభుత్వం మార్కెట్‌లోకి రాకుండా నియంత్రించాల్సిన బాధ్యతను విస్మరించింది. ఫలితంగా గుట్కా మాఫియా రెచ్చిపోతోంది. కిళ్లీ బంకులు, కిరాణా షాపుల మొదలు ప్రధాన వ్యాపార సంస్థల్లోనూ ఇవి అందుబాటులో ఉంటున్నాయి. సిగరెట్‌, బీడీల కంటే వీటిపైనే అత్యధిక ఆదాయం సమకూరుతుండటంతో ప్రతి దుకాణంలోనూ వీటిని బహిరంగంగానే విక్రయిస్తున్నారు.

LEAVE A REPLY