గుంటూరు జిల్లాలో పెరిగిన అత్యాచారాలు.. హత్యలు

0
23

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అర్బన్‌ పరిధిలో 299 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఈ ఏడాది చీటింగ్‌ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన రెండేళ్లతో పోలీస్తే నేరాల సంఖ్య కొంత వరకు తగ్గిందనే చెప్పాలి. 2014లో 5,813 నేరాలు జరగ్గా 2015లో ఆ సంఖ్య 4,423కు చేరింది. ఈ ఏడాది స్వల్పంగా తగ్గి 4,223కు చేరింది. సాధారణ దొంగతనాలు గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. హత్యలు గత ఏడాది 44 జరిగితే ఈ ఏడాది 35 జరిగాయి. గతేడాది హత్యా యత్నం కేసులు 37 నమోదైతే ఈ ఏడాది 50 వరకు నమోదయ్యాయి. అర్బన్‌ పరిధిలో ఈ ఏడాది కిడ్నాప్‌లు, అత్యాచారం కేసులు పెరిగాయి. గత ఏడాది 82 కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 126 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గత ఏడాది 33 అత్యాచార కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 42కు పెరిగింది. చీటింగ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది 301 నమోదు కాగా, ఈ ఏడాది 374 కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here