రం మైనింగ్ ఆఫీసులపై ఆదాయ పన్నుశాఖ అధికారులు ఇవాళ దాడులు చేశారు. ఇటీవలే కూతురు పెళ్లిని ఘనంగా నిర్వహించిన గాలి జనార్దన్‌రెడ్డిపై ఐటీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత వైభవంగా నిర్వహించిన ఆ మ్యారేజ్ కోసం సుమారు 500 కోట్లు ఖర్చు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాలి కుమార్తె బ్రాహ్మణి వివాహం అయిదు రోజుల క్రితమే జరిగింది. పెద్ద నోట్ల రద్దును ప్రధాని ప్రకటించిన తర్వాతే ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక విచారణ అధికారి కౌసల్య కుమార్ ఆధ్వర్యంలో గాలి జనార్థన్ రెడ్డి ఇండ్లల్లో సోదాలు జరుగుతున్నట్లు మీడియా వార్తలు వస్తున్నాయి. గాలి ఇంటి నుంచి కొన్ని కీలకమైన డ్యాకుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బళ్లారిలో గాలికి చెందిన నాలుగు ఇండ్లల్లో దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఏ కారణం చేత అధికారులు దాడులు చేస్తున్నరన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కర్నాటకు చెందిన మాజీ మంత్రి మైనింగ్ కంపెనీ ద్వారా అక్రమంగా వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి.