గాలి ఆప్తుడు.. భీమానాయక్‌ అరెస్టు

0
25

కర్ణాటకలో గనుల ‘ఘనుడు’ గాలి జనార్దనరెడ్డికి అత్యంత ఆప్తుడైన భీమానాయక్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కర్ణాటక అడ్మినిసే్ట్రటివ్‌ ఆఫీసర్‌(కేఏఎస్‌) అయిన భీమానాయక్‌… భూవిస్తరణాధికారిగా పని చేస్తున్నారు. కుమార్తె వివాహ ఖర్చుల కోసం జనార్దన్‌రెడ్డికి రూ.100 కోట్లకుపైగా నల్లధనాన్ని కొత్త కరెన్సీగా మార్చినట్లు భీమా నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాలి నుంచి 20శాతం కమీషన తీసుకున్నాడు. అంతేకాదూ… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున టికెట్‌ను కూడా భీమా ఆశిస్తున్నారు. జనార్దన్‌రెడ్డికి అప్పగించడానికి కొత్త కరెన్సీని తన వద్ద పని చేసే డ్రైవర్‌ రమేశ్‌గౌడ వాహనంలోనే భీమా తరలించాడు.

LEAVE A REPLY