గాలిని ఇల్లు దాటొద్దన్న సుప్రీం

0
10

మైనింగ్ ఘనుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఊహించని షాక్. అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్నికలు ముగిసేవరకు ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

బళ్లారిలోకి ప్రవేశించకుండా మూడేళ్ల కిందట షరతులతో కూడినబెయిల్ మంజూరు సమయంలోనే న్యాయస్థానం నిషేధం విధించింది. ఐతే, బళ్లారి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు సోమశేఖర్ రెడ్డి తరపున ప్రచారం చేపట్టేందుకు 10 రోజుల పాటు నిషేధాన్ని పక్కన పెట్టాలని గాలి తరపు లాయర్ కోర్టుని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం గాలికి లేదని కోర్టు అభిప్రాయపడింది

LEAVE A REPLY