ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ సిరీస్ విజయం దక్కించుకునే దిశగా ముందుకు వెళతోంది. ఇప్పటికీ 2-0 తేడాతో ముందు నిలిచిన కోహ్లీ సేన నాలుగో టెస్ట్‌ను కూడా గెలవాలని చూస్తోంది. ఈ సీరీస్‌లో కోహ్లీ ఇప్పటివరకూ 551 పరుగులు చేశాడు. అయితే భారత్ తరుపున కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో ఐదొందలకు పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా అవతరించాడు కోహ్లీ. అంతకుముందు గవాస్కర్ ఇలాంటి ప్రదర్శ రెండు సార్లు చేశాడు. 1978-79 టైంలో వెస్టిండీస్‌పై 732, 1981-82 సమయంలో మరోసారి ఇంగ్లండ్‌పై 500 పరుగులు చేశాడు గవాస్కర్. ఒక టెస్ట్ సీరీస్‌లో ఇలా ఐదొందలకు పైగా పరుగులు సాధించిన భారత కెప్టెన్లు వీళ్లిద్దరే.