గవర్నర్‌ను కోరాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 16 నుంచి అసెంబ్లీ

0
24

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం ప్రగతి భవన్‌లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రకటించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు నోట్ పంపించాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు టీ హరీశ్‌రావు, కే తారక రామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here