గవర్నర్‌కు టీపీసీసీ ఫిర్యాదు

0
4

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శానసభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పునిచ్చినా తెలంగాణా ప్రభుత్వం అమలు చేయడంలేదంటూ తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ ప్రతినిధిబృందం గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్ వెంటనే దృష్టి పెట్టాలని, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని వారు అభ్యర్థించారు. అలాగే.. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బ తిన్న రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని కూడా కోరుతూ వారు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. వీరి అభ్యర్థనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY