గల్ఫ్ బాధితుడు రాజేందర్‌కు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ ఆర్థిక సాయం

0
34

బతుకుదెరువుకోసం గల్ఫ్ వెళ్లి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లను పోగొట్టుకున్న గూగులవత్ రాజేందర్‌కు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్‌శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్‌కుమార్ రాధారపు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బృందం గత శుక్రవారం రాజేందర్ చికిత్స పొందుతున్న బహ్రెయిన్‌లోని హమ్మద్ దవాఖానకు వెళ్లి పరామర్శించారు.
చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని, కనీసం భార్యా పిల్లలతో ఫొన్‌లో మాట్లాడేందుకు చేతిలో చిల్లిగవ్వలేదని రాజేందర్ గోడును వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన నేతలు వైద్యఖర్చుల నిమిత్తం రాజేందర్‌కు నగదును అందజేశారు. జగిత్యాల జిల్లా రంగారావుపేట్‌కు చెందిన రాజేందర్ బతుకుదెరువుకోసం బహ్రెయిన్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత సెప్టెంబర్‌లో డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో రాజేందర్ బంధువు ఒకరు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌ను ఆశ్రయించాడు. బహ్రెయిన్‌లోని తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తమవంతు సహాయం అందిస్తామని సతీశ్‌కుమార్ తెలిపారు. రాజేందర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యక్షుడు వెంకటేశ్ బొలిశెట్టి, తదితరులు ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here