గతమెంతో ఘనంగా లేకపోయినా

0
30

గతమెంతో ఘనంగా లేకపోయినా.. భవిష్యత్ రంగులమయం అవుతుందో లేదో తెలియకపోయినా… వర్తమానంలో మాత్రం భారత క్రీడాకారిణులు హరివిల్లులు పూయించారు. ఆశలు లేని స్థాయి నుంచి అవకాశాలను ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ ఏడాది సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
అంచనాలు వేసుకున్న క్రీడాంశాల్లో పతకాలు చేజారినా.. అచంచల ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ తమదైన ముద్ర వేస్తూ భారత కీర్తి ప్రతిష్టను శిఖరానికి చేర్చారు. బ్యాడ్మింటన్ ధ్రువతార సింధు నుంచి మొదలుపెడితే.. గోల్ఫ్ టీనేజ్ సంచలనం అదితి వరకు ఈ ఏడాది మన మహిళామణులు సాధించిన అత్యుద్భుత విజయాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

LEAVE A REPLY