గడ్డుగా దేశ ఆర్థిక పరిస్థితి

0
19

దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.6 శాతం కన్నా తక్కువగా నమోదవుతుందన్నారు. అయినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అతిశయోక్తులను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని వివరించే డాక్యుమెంట్‌ను ఆయ న సోమవారం మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంతో కలిసి ఢిల్లీలో విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ వృద్ధిరేటు 7.6 శాతం నుంచి 6.6 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ చెప్పిందని గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ తొలి ఐదేం డ్ల కాలంలో వృద్ధిరేటు 8.5 శాతంగా నమోదైందని, 2008 లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నా మన దేశంలో వృద్ధిరేటు పడిపోలేదని చిదంబరం గుర్తు చేశారు. తమ పదేండ్ల కాలంలో ఏడు శాతం వృద్ధిరేటును అందించామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అంకెలగారడీ చేస్తున్నదని, పరోక్షపన్నుల మాటున పేదలను వేధిస్తున్నదన్నారు.

ఏ తప్పూ చేయలేదు
విజయ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు, దానిని గట్టెక్కించేందుకు తాను ప్రత్యేక ఆసక్తి కనబరిచానన్న ఆరోపణను మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు. ఏ తప్పూ చేయలేదని, చట్టాల ప్రకారమే వ్యవహరించానని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here