గగనతలాన దక్షిణాసియా బంధం

0
28

భారత్ ప్రప్రథమంగా ప్రాంతీయ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దక్షిణాసియా కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-9 శుక్రవారం కక్ష్యలోకి ప్రవేశించింది. పాకిస్థాన్ మినహా యావత్తు సార్క్ దేశాలకు ఉపయోగపడే ఈ అధునాతన ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ-ఎఫ్09 రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌ను ఈ రాకెట్‌లో ఉపయోగించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఉపగ్రహాన్ని తయారుచేసింది. దక్షిణాసియా అభివృద్ధి అవసరాలు తీర్చడంలో ఈ ఉపగ్రహం ఎంతో ఉపకరిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇస్రో చైర్మన్‌కు పంపిన ఒక అభినందన సందేశంలో పేర్కొన్నారు. పొరుగు దేశాలతో భారత్ బంధాన్ని పటిష్ఠపరిచి స్నేహ, సహకారాలను వృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తన అంతరిక్ష దౌత్యంలో భాగంగా ఈ ఉపగ్రహాన్ని సార్క్ దేశాలకు కానుకగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here