ఖైదీ సక్సెస్ కోసం మేకని బలి ఇచ్చిన ఫ్యాన్స్

0
26

హీరో హీరోయిన్లపై అభిమానం కొంత వరకు ఉంటే పరవాలేదు కాని హద్దులు దాటితే మాత్రం చాలా మంది ఇబ్బంది పడతారు అనే విషయం ఇప్పటికే పలుమార్లు ఋజువు అయింది. నిన్న ఖైదీ నెం 150 చిత్రం టిక్కెట్ దొరకలేదని ఓ వ్యక్తి గొంతు కోసుకున్న సంఘటన పలువురిని బాధించింది. ఇక కొందరు అభిమానులు టైంకి షో వేయలేదని ఫర్నీచర్ తో పాటు స్క్రీన్ ని ధ్వంసం చేశారు. ఈ వికృత చేష్టలకు చాలా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని థియేటర్ యాజమాన్యం తెలిపింది.

ఇక మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఖైదీ నెం 150 రిలీజ్ సందర్భంగా ఓ మేకని బలిచ్చారు. ఈ చిత్రం భారీ హిట్ కావాలని వారు మేకని బలి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన కర్నూల్ జిల్లాలోని కొడుమూర్ పాత్రంలో ఉన్న రామచంద్ర థియేటర్ దగ్గర జరిగింది. మేకని బలి ఇచ్చిన అభిమానులు ఆ తర్వాత ఖైదీ నెం 150 పోస్టర్ కి వేలాడదీయడం టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. బాహుబలి చిత్రం రిలీజ్ టైంలో ప్రభాస్ ఫ్యాన్స్ వికారాబాద్ లో మేకని బలి ఇచ్చారు. ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ టైంలోను పవన్ ఫ్యాన్స్ మేకని బలి ఇచ్చారు. ఇలాంటి వికృత చేష్టలు చేయోద్దని తన అభిమానులకు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నా వారు మాత్రం తమ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.

ఖైదీ నెం 150 చిత్రం ప్రస్తుతం లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ చిత్రంకు తొలి షో నుండే మంచి టాక్ రావడంతో అభిమానులు ఆనందోత్సాహలలో ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంటే ఓవర్సీస్ లో బాహుబలి రికార్డును కొద్దిలో మిస్ అయింది. యూఎస్ ప్రీమియర్స్ మొత్తం పూర్తయ్యేసరికల్లా ఖైదీ నంబర్ 150 చిత్రం 1.25 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం. బాహుబలి ప్రీమియర్ షోస్ కి 1.3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here