‘ఖైదీ నం.150’ పంచ్ డైలాగులు పేల్చిన చిరంజీవి

0
71

ఖైదీ నం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి పంచ్ డైలాగులు చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. ‘పొగరు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంది. కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్’ అని సినిమాలో ఓ సందర్భంలో వచ్చే డైలాగ్‌ను చిరు తన స్టైల్‌లో చెప్పినప్పుడు సభా ప్రాంగణం దద్దరల్లింది. సీనియర్ రచయిత సత్యానంద్‌తో కూడా తాను చర్చించి స్క్రిప్టు సహకారం తీసుకున్నానని, ఆయన ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తిగా పని చేశారని చిరంజీవి చెప్పారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నం.150 సంక్రాంతికి విడుదలవుతోంది. పండుగకు విడుదలవుతున్న ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

LEAVE A REPLY