ఖైదీ నంబ‌ర్ 150 సెట్లో విదేశీ మేయ‌ర్

0
20
మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాట‌ల చిత్ర‌ణ‌కు యూర‌ప్ ట్రిప్ వెళ్లింది యూనిట్‌. అక్క‌డ క్రొయేషియా, స్లోవేనియా వంటి పలు లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అయితే ఆ లొకేష‌న్‌కి ఓ అనుకోని అతిథి వ‌చ్చి చిరంజీవి, కాజ‌ల్ స‌హా యూనిట్‌ని ప‌ల‌క‌రించారు. అంతేనా త‌మ దేశంలో షూటింగ్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కూడా చెప్పారు. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రానికి ఉన్న పాపులారిటీని, క్రేజును అడిగి మ‌రీ తెలుసుకున్నారు. అస‌లింత‌కీ ఎవ‌రా అతిథి.. అంటే డుబ్రోవ్నిక్ నగర మేయ‌ర్ ఆండ్రూ వ్లాహుసిక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here