ఖాతాల్లేవు…జీతాల్లేవు…డబ్బులు తీసుకునేదెట్లా..

0
23

డిసెంబర్‌ ఒకటో తారీఖు చిరుద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బ్యాంకు ఖాతాల్లేక జీతాలు తీసుకోలేని పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే నవంబర్‌ 9 నుంచే నెలాఖరు కష్టాలు అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది చిరుద్యోగులు. బ్యాంకు ఖాతాలు లేక జీతం తీసుకోలేని చిరుద్యోగులు ఎంతో మంది. దుకాణాలు, చిన్న షాపింగ్‌ మాల్స్‌, సెక్యూరిటీ గార్డులు వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సామాన్యుల నెత్తిన పెద్దనోటు పిడుగుపాటులా దాపురించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పోపుడబ్బాలో దాచుకున్న కొద్దిడబ్డును బయటకి లాగింది ఈ నోట్లరద్దు అంటూ గృహిణులు గొణుక్కుంటున్నారు. నెలమొదలే చెల్లించాల్సిన ఇంటి అద్దె, కిరాణాసరుకులు, కూరగాయల ఖర్చు ఈ నెల అప్పే గతి అంటూ మరికొందరి ఆవేదన. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధరంగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల ఒకటోతారీఖు కష్టాలు..! వారి అభిప్రాయాల్లోనే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here