ఖాతాలో వందలు.. 100 కోట్లు డెబిట్‌

0
21

అతడి ఖాతాలో ఉన్న సొమ్ము కొన్ని వందల రూపాయలే! కానీ.. అందులో నుంచి రూ.100 కోట్లు డెబిట్‌ అయిపోయాయి!! ఆగ్రాకు చెందిన సందీప్‌ తివారీ మెకానికల్‌ ఇంజనీర్‌. చదువుకునే రోజుల్లో ఎస్‌బీఐలో పొదుపు ఖాతా తెరిచాడు. డబ్బు వేసి తీస్తుండేవాడు. మంగళవారం అతడు ఏటీఎంలో డబ్బు తీయాలని చూడగా.. ఖాతాలో సొమ్ము లేదని సందేశం వచ్చింది. ఆశ్చర్యపోయిన సందీప్‌.. బ్యాలెన్స్‌ ఎంతుందో చూద్దామని స్టేట్‌మెంట్‌ తీసుకోగా దిమ్మతిరిగే అంకెలు కనపడ్డాయి. అతడి ఖాతాలోంచి రూ.99,99,91,723.36 తీసినట్టు ఉంది. దీనిపై బ్యాంకు అధికారులు స్పందించారు. అతడి పూర్తి వివరాలు (నో యువర్‌ కస్టమర్‌-కేవైసీ) సమర్పించాల్సిందిగా ఎన్నిసార్లు సందేశాలు పంపినా సందీప్‌ స్పందించలేదని, అందుకే సిస్టమ్‌ ఆటోమేటిగ్గా అతడి ఖాతాను ఇలా చేయడం ద్వారా బ్లాక్‌ చేసిందని వివరించారు. అతడి డబ్బు అతడి ఖాతాలో సురక్షితంగా ఉందని.. కేవైసీ వివరాలు సమర్పిస్తే అప్‌డేట్‌ అవుతుందన్నారు.

LEAVE A REPLY