ఖజానాకు పెద్ద నష్టం!

0
19

పెద్దనోట్ల రద్దు రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ లోటుభర్తీ బాధ్యత కేంద్రానిదేనన్నారు. నల్లధనం అరికట్టే విషయంలో ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని అదే సమయంలో అమలులో లోపాలను సవరించాలని కోరుతున్నామని అన్నారు.
పెద్దనోట్ల రద్దుతో కేవలం 17 రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఖజానాకు గండి పడిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రగతిపథంలో దూసుకుపోతున్న రాష్ర్టానికి ఇది తీవ్రనష్టమన్నారు. రద్దు చేసిన విలువకు సరిపడా కొత్తనోట్లను కేంద్రం విడుదల చేయనందువల్లనే రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు వచ్చాయన్నారు. తక్షణం రూ.5వేల కోట్ల చిన్న నోట్లు పంపి ఆదుకోవాలని కోరామని, అవి రాష్ర్టానికి చేరితే పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం, ప్రత్యామ్నాయ మార్గాలు, అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోళ్ల్లు, చెల్లింపులు వంటి అనేక అంశాలపై ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

LEAVE A REPLY