క‌రెన్సీ నోటులో జంతువుల కొవ్వు!

0
30

లండ‌న్‌: క‌రెన్సీలో నోటులో జంతువుల కొవ్వు ఉండ‌టాన్ని బ్రిట‌న్‌లోని హిందూ ఫోర‌మ్ ఆఫ్ బ్రిట‌న్ (హెచ్ఎఫ్‌బీ) తీవ్రంగా నిర‌సిస్తోంది. ఈ నోటును వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. బ్రిట‌న్‌లో కొత్త‌గా విడుద‌లైన ఐదు పౌండ్ల నోటులో జంతువుల కొవ్వు వాడిన‌ట్లు ఈ సంఘం ఆరోపిస్తోంది. ఇది కావాల‌ని చేసిన చ‌ర్య కాద‌ని, తెలియ‌క చేసిందే అయినా.. ఆ నోట్లను వెంట‌నే చెలామాణిలో నుంచి ర‌ద్దు చేయాల‌ని హెచ్ఎఫ్‌బీ డిమాండ్ చేసింది. ల‌క్ష్మిలాగే పూజిస్తూ మ‌నం దాచుకొనే, ఖ‌ర్చు చేసే క‌రెన్సీలో జంతువుల‌కు హాని చేసి వాడిన ప‌దార్థం ఉండ‌టం ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని యూకే ఇస్కాన్ ఆల‌య డైరెక్ట‌ర్‌, హెచ్ఎఫ్‌బీ స్పిరుచువ‌ల్ క‌మిష‌న‌ర్ గౌరిదాస్ స్ప‌ష్టంచేశారు. ఈ నోటును వెంట‌నే ఉప‌సంహ‌రించాల్సిందిగా కోరుతూ ఈ గ్రూప్ సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టింది. టాలో రూపంలో జంతువుల కొవ్వు ఈ నోటు త‌యారీలో వాడ‌టంపై శాకాహారులు మండిప‌డుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here