క్వీన్‌ ఎలిజబెత్‌ను కలిసిన కమల్‌హాసన్‌

0
23

ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలిశారు. ఇటీవల బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ఇండో-యూకే కల్చరల్‌ ఎక్స్ఛేంజి సెలబ్రేషన్స్‌ 2017 కార్యక్రమంలో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌ మంచి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె భారత్‌ పర్యటనను గుర్తుంచుకున్నారని కమల్‌హాసన్‌ తెలిపారు. డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. 1997లో క్వీన్‌ ఎలిజబెత్‌ భారత పర్యటనలో భాగంగా చెన్నైకి వెళ్లారు. అప్పుడు ఆమె మరుదనాయగం సినిమా సెట్‌కు రావడాన్ని కమల్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కమల్‌హాసన్‌ ఎలిజబెత్‌తో ఫొటో దిగారు. బహుశా రాణి వెళ్లిన ఒకే ఒక సినిమా షూటింగ్‌ అదే అయి ఉంటుందని అనుకుంటున్నానని కమల్‌హాసన్‌ అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం బ్రిటన్‌కు వెళ్లింది. ఈ వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కమల్‌హాసన్‌ పేరును సూచించారు. క్వీన్‌ ఎలిజబెత్‌తో పాటు డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ విలియం, కేట్‌, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌, డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆప్‌ గ్లోసెస్టర్‌, ప్రిన్స్‌ మైకేల్‌ తదితర రాజకుటుంబీకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు తన పేరు ప్రతిపాదించినందుకు కమల్‌ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here