క్వార్టర్స్‌లో తెలంగాణ

0
12

అంతర్‌ రాష్ట్ర పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో భిలాయ్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ టీమ్‌ విభాగంలో తెలంగాణ క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో గుజరాత్‌పై గెలుపొందింది.

తొలి సింగిల్స్‌లో తరుణ్‌ అనిరుధ్‌ (తెలంగాణ) 6–7 (1–7), 6–1, 6–4తో జై సోనిపై, రెండో సింగిల్స్‌లో పీసీ అనిరుధ్‌ (తెలంగాణ) 6–0, 6–7 (5–7), 6–4తో ఉదయన్‌ భాస్కర్‌పై నెగ్గగా… డబుల్స్‌ మ్యాచ్‌లో అంకం కృష్ణ తేజ– తరుణ్‌ జంట 6–3, 6–2తో జైసోని– ఉదయన్‌ భాస్కర్‌ జోడీపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్‌ జట్టును ఓడించింది. తరుణ్‌ అనిరుధ్‌ 7–6 (7–4), 6–4తో భవేశ్‌ గౌర్‌ (మధ్యప్రదేశ్‌)పై, పీసీ అనిరుధ్‌ 6–2, 6–1తో యశ్‌ యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)పై గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here