క్రీడా ‘పద్మా’లు

0
17

భారత క్రీడారంగంలో స్వర్ణకాంతులతో కొత్త వెలుగులు నింపిన క్రీడాకారులకు బుధవారం కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. తమ క్రీడాంశాల్లో అత్యద్భుత ప్రతిభ చూపెట్టిన ప్లేయర్లకు ఈ అరుదైన ఘనతను కట్టబెట్టింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అంధుల క్రికెట్ సారథి శేఖర్ నాయక్, వికాస్ గౌడ (డిస్కస్ త్రోయర్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), పీఆర్ శ్రీజేష్ (హాకీ), సాక్షి మాలిక్ (రెజ్లింగ్)లకు ఈ పురస్కారాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం మొత్తం 89 మంది పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాల్లో ఈసారి క్రీడాకారులకు చోటు దక్కలేదు.

LEAVE A REPLY