క్రికెట్ చరిత్రలో తొలిసారి..!

0
26

సిడ్నీ:ఇక నుంచి మహిళా క్రికెట్ అంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారా?, కేవలం మహిళా క్రికెట్ మ్యాచ్ లకే కాకుండా పురుషుల క్రికెట్ మ్యాచ్ ల్లో సైతం మహిళా అంపైర్లు రాబోతున్నారా?అంటే అవుననక తప్పదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లైర్ పొలోసాక్ ఒక పురుషుల మ్యాచ్ కి అంపైరింగ్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తద్వారా పురుషుల మ్యాచ్ లకు మహిళా అంపైర్లు అంపైరింగ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందనే విషయం మరింత బలపడుతోంది.

అంపైర్ల ఎలైట్ ప్యానల్ లో కొనసాగుతున్న 29 ఏళ్ల పొలోసాక్..  ఆదివారం జరిగిన దేశవాళీ పురుషుల క్రికెట్ మ్యాచ్ లో అంపైరింగ్ చేశారు. న్యూ సౌత్ వేల్స్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పొలోసాక్ అంపైరింగ్ చేసి ఆకర్షించారు. ఇలా పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఒక మహిళ అంపైరింగ్ చేయడం క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం ఇక్కడ విశేషం. అయితే ఆమెకు ఎప్పుడూ క్రికెట్ ఆడిన అనుభవ మాత్రం లేకపోవడం మరో విశేషం. కేవలం అంపైరింగ్ గురించి మాత్రమే తెలుసుకుని అందులో పొలోసాక్ ఆరితేరారు.  ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ‘నేను ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లు ఆడలేదు. మ్యాచ్ లు చూడటం మాత్రమే ఇష్టం. అందులో అంపైరింగ్ పై ఆసక్తి ఉండేది. దాంతో నాన్న అంపైరింగ్  కోర్సులో చేర్పించారు. అలా అంపైర్ గా స్థిరపడ్డాను. ఇదొక సువర్ణావకాశం. మహిళల క్రికెట్ కు కూడా మరింత స్ఫూర్తిదాయకంగా నిలుసుందని భావిస్తున్నా’అని పొలోసాక్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here