క్యాష్‌లెస్ విలేజ్.. ఇబ్రహీంపూర్

0
27

సిద్దిపేట నియోజకవర్గాన్ని నెలాఖరులోగా నగదు రహితంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంలో తొలి అడుగు పడింది. సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ సోమవారం నగదు రహిత గ్రామంగా నిలిచింది. దీంతో దేశంలోనే రెండో, దక్షిణ భారతదేశంలో తొలి నగదు రహిత లావాదేవీల గ్రామంగా రికార్డు సృష్టించింది. సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి: దక్షిణ భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు చేపట్టిన తొలి గ్రామంగా సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాబూమోహన్‌లు సోమవారం రాత్రి నగదు రహిత లావాదేవీల గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలి నగదురహిత గ్రామంగా ఇబ్రహీంపూర్ నిలిచిందన్నారు. గ్రామస్ఫూర్తితో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు నగదు రహిత లావాదేవీల దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. రూపే కార్డుదారులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు.

LEAVE A REPLY