క్యాష్‌లెస్‌కు కొత్త ఊపు..

0
16

గదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), ఫింగర్‌ప్రింట్ రీడర్‌లు, మైక్రో ఏటీఎంలు తదితర మార్గాల ద్వారా జరిగే ఈ-పేమెంట్స్‌పై అన్ని రకాల పన్నులను ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ (బీసీడీ), ఎక్సైజ్ డ్యూటీస్, కౌంటర్‌వాలింగ్ డ్యూటీస్ (సీవీడీ), స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ (ఎస్‌ఏడీ)ను ఎత్తివేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ-పేమెంట్స్ జరిపే యంత్రాలు, విడిభాగాల తయారీపైనా పన్నులను మినహాయించారు. దీనిపై ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. అయితే యంత్రాలు, విడిభాగాల తయారీపై పన్ను మినహాయింపును పూర్తి ఆర్థిక సంవత్సరానికి కాకుండా కొంత కాలానికే పరిమితం చేయాలని సూచించింది. జైట్లీ నిర్ణయంతో యంత్రాల ఉత్పత్తి పెరిగి కొరతను అధిగమించవచ్చని, అయితే దీర్ఘకాలం కొనసాగితే ఇతర దేశాల నుంచి భారీగా యంత్రాలు దిగుమతి అయ్యే అవకాశం ఉందని అసోసియేషన్ కార్యదర్శి రాజూ గోయెల్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here