‘క్యాంపస్ జాబులు వదులుకోవద్దు’

0
25

అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌ మేళాలో 714 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలలో ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో నాలుగు విడతలుగా వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఎంపికలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్‌ మేళాలో 19 బడా కంపెనీలకు చెందిన ప్రతినిదులు హాజరయ్యారు. తొలుత వుడా ఉపాధ్యక్షుడు పి.బాబూరావు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్‌ మేళాను ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌ మేళాల వల్ల విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయ న్నారు. కేంపస్‌ సమయంలో వచ్చిన ఉద్యోగాలను వదులుకోకూడదని సూచించారు. విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఉండాలని, అప్పుడే పోటీని తట్టుకోవచ్చునన్నారు.

LEAVE A REPLY