కోహ్లీ తర్వాత వార్నరే

0
22

పాకిస్థాన్‌తో ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రికార్డుల మోత మోగించాడు. తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (179; 128 బంతుల్లో 19×9, 5×6) నమోదు చేశాడు. మరో ఓపెనర్‌ ట్రావిడ్‌ హెడ్‌ (128; 137 బంతుల్లో 9×4, 3×6)తో కలిసి తొలి వికెట్‌కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆసీస్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. పాక్‌పై 2012లో మీర్పూర్‌లో 183 పరుగులు చేసిన భారత సారథి విరాట్‌కోహ్లీ తర్వాత వార్నరే (179) ఆ జట్టుపై ఎక్కువ స్కోర్‌ చేయడం గమనార్హం. హాషీమ్‌ ఆమ్లా 83, విరాట్‌కోహ్లీ 86 వన్డే ఇన్నింగుల్లో 13 శతకాలు బాదగా వార్నర్‌ ఇందుకు 91 ఇన్నింగ్స్‌లు తీసుకొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here