కోహ్లీలా సచిన్‌ చేయడం చూసుండను

0
27

పుణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన కోహ్లీ సేనకు సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 333 పరుగులు తేడాతో పరాభవం చవిచూసింది. ఐతే బెంగళూరు మ్యాచ్‌ నుంచి టీమిండియా విజయ దుందుభి మోగిస్తుందని దాదా ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వరుసగా నాలుగు టెస్టు సిరీసుల్లో నాలుగు ద్విశతకాలు బాదిన విరాట్‌ను గంగూలీ ప్రత్యేకంగా అభినందించాడు.

పుణెలో విఫలమైన కోహ్లీ బెంగళూరులో సత్తా చాటగలడని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌కు సైతం సాధ్యం కాని విధంగా కంగారూలపై విరాట్‌కు అద్భుత రికార్డు ఉందన్నాడు. ‘ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై కోహ్లీ వరుసగా నాలుగు శతకాలు బాదడం అనూహ్యం. సచిన్‌ సైతం అలా చేయడం నేనెప్పుడూ చూడలేదు’ అని అన్నాడు. ఆస్ట్రేలియాలో గతంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ నాలుగు శతకాలు బాది 662 పరుగులు చేశాడు.

LEAVE A REPLY