కోహ్లీలా జిమ్‌లో రహానె కసరత్తు

0
14

బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌లో సత్తా చాటేందుకు భారత టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె కసరత్తు ప్రారంభించాడు. ఆటకు దూరంగా ఉన్నప్పుడు, విశ్రాంతి లభించినప్పుడల్లా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతాడు. తాను ఫిట్‌నెస్‌, ఫామ్‌ను కొనసాగించడానికి జిమ్‌లో సాధన చేయడం కూడా ఒక కారణమని కోహ్లి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లి ట్రెండ్‌ను రహానె కూడా అనుసరిస్తుండటం విశేషం.

ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే మ్యాచ్‌ల్లో రహానె పేలవ ఫామ్‌తో రాణించలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సైతం చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆటతీరును మెరుగుపరచుకోవడం మాత్రమే కాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఈ నెల 9న ఉప్పల్‌ స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ ఆరంభంకానుంది.

LEAVE A REPLY