కోల్‌బెల్ట్‌లో వెల్లువెత్తిన నిరసన

0
10

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై కోల్‌బెల్ట్‌వ్యాప్తంగా కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో గనులపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కుట్ర వెనుక జేఏసీ, కాంగ్రెస్ ఉన్నాయని ఆరోపిస్తూ గనులు, డిపార్టుమెంట్లు, ఓసీపీలపై వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కార్మికుల కష్టాలను గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంటే, తినేఅన్నంలో మన్నుపోసినట్టుగా కాంగ్రెస్, జేఏసీ ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, జేఏసీ నేతలు కోల్‌బెల్ట్‌లో ఉండవద్దంటూ నినాదాలు చేశారు.వారసత్వ ఉద్యోగాలు వస్తే తమకు ఉనికి ఉండదనే ఈ కుట్రలు పన్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టులో సరైన నిర్ణయం వచ్చేవరకు న్యాయపోరాటం చేయాలని కార్మికులు, నేతలు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY