కోల్‌కతా చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు

0
23

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ నెల 21న జరగనున్న రెండో వన్డేకూ వాన ముప్పు ఉంది. స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ గణేష్‌ దాస్‌ మాట్లాడుతూ ‘ఈ నెల 21 వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేశాం. ఇక్కడ ఈ నెలంతా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఎక్కువ’ అని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన క్యాబ్‌ అధ్యక్షుడు గంగూలీ స్టేడియం వర్గాలకు అవసరమైన సూచనలు చేశారు. పిచ్, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. రెండో వన్డే ఆడేందుకు ఇరు జట్లు సోమవారం కోల్‌కతా చేరుకున్నాయి. అంతకుముందు కోల్‌కతాకు బయలు దేరేముందు చెన్నై విమానాశ్రయంలో ధోని, కోహ్లి తదితరులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్లోర్‌పై కాసేపు సేదతీరిన ఫొటోలను బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. కోల్‌కతా చేరుకున్న ఆటగాళ్లు సోమవారం  ప్రాక్టీస్‌ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here