కోలుకుంటున్న పారుల్‌ యాదవ్‌

0
31

ముంబయిలో తన ఇంటి సమీపంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన నటి పారుల్‌ యాదవ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. 13కుపైగా శునకాలు పది రోజుల క్రితం పారుల్‌ తల, శరీరం, చేతులపై దాడి చేసి గాయపరిచాయి. ఒళ్లు చీరుకు పోయిన చోట్ల చిన్నపాటి శస్త్రచికిత్సలను నిర్వహించిన వైద్యులు ఆమెను తిరిగి ఇంటికి ప¾ంపించారు. గోవిందాయనమః చిత్రంలోని నటన, ప్యార్‌గే ఆగ్‌ బిట్టయితే పాట ద్వారా ఆమె కన్నడ చిత్ర ప్రేమికుల అభిమానాన్ని దక్కించుకున్నారు. సినిమా క్రికెట్‌ లీగ్‌లో కన్నడ జట్టుకు మొదటి నుంచి మద్దతు ప్రకటిస్తూ, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్న విషయం విదితమే.

LEAVE A REPLY