కోర్టుల్లోకి రాజకీయాలు రావొద్దు

0
29

రాజకీయాలు న్యాయస్థానాల్లోకి చొరబడరాదని తాము కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరువుపీడిత 12 రాషా్ట్రలలో రైతులను ఆదుకోవడంపై స్వరాజ్‌ అభియాన్‌ సంస్థ వేసిన పిల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిన్‌ ఎన్వీ రమణల బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై విచారణ జరుగుతుండగా ఒకదశలో …రాజకీయపార్టీలు ప్రజలపక్షాన ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేస్తే, కోర్టులు స్వీకరిస్తాయా అన్న ప్రస్తావన వచ్చింది. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుని, అప్పుడు కోర్టులలోకి రాజకీయాలు చొరబడటం తమకిష్టం లేదని పేర్కొంది. ‘స్వరాజ్‌ అభియాన్‌’ తరఫున లాయర్‌ ప్రశాంత భూషణ్‌ వాదనలు వినిపించారు. కేంద్రం తరఫున హాజరైన ఏజీ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ‘స్వరాజ్‌ ఇండియా’ అనే పార్టీకి అనుబంధంగానో, లేక తమకు తామే ఒక పార్టీగానో కొనసాగాలని భావిస్తున్నట్లుగా ఆ స్వచ్ఛంద సంస్థ స్వయంగా ప్రకటించుకుందన్నారు. ‘స్వరాజ్‌ అభియాన్‌’, ‘స్వరాజ్‌ ఇండియా’ వేర్వేరు సంస్థలని, స్వరాజ్‌ అభియాన్‌ రాజకీయ పార్టీ కాదని భూషణ్‌ బదులిచ్చారు.

LEAVE A REPLY