కోట్లకు పడగలెత్తిన విశాఖ డీఈఈ ఏకకాలంలో 7 చోట్ల ఏసీబీ దాడులు

0
23

అక్రమార్జనతో రూ.కోట్లు కూడబెట్టిన రోడ్లు, భవనాల శాఖ విశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(డీఈఈ) సుభా్‌షచంద్రపాత్రో నివాసంపై శనివారం అవినీతి నిరోధక శాఖ కేంద్ర పరిశోధన బృందం(సీఐయూ) దాడులు నిర్వహించింది. విశాఖలోని విశాలాక్షి నగర్‌లో ఉన్న సుభా్‌షచంద్రపాత్రో నివాసంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్‌లలో 7 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 15 ఇళ్ల స్థలాలు, 2 నివాస భవనాలు, ఒక ఫ్లాట్‌ సహా సుమారు రూ.4.09 కోట్ల(రిజిస్ర్టేషన విలువ) విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్‌ విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెంఖల్లుకు చెందిన సుభా్‌షచంద్రపాత్రో 1981లో రోడ్లు, భవనాలశాఖలో ఏఈగా ఉద్యోగంలో చేరారు. విజయనగరంలో తొలిపోస్టింగ్‌ పొందిన పాత్రో తర్వాత డెప్యూటేషన్‌పై ఎంఐడీసీలో పనిచేశారు. తర్వాత డీఈగా పదోన్నతి పొందారు.

LEAVE A REPLY