కోటి లింగాల వేదికగా…!

0
72

ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన మహాచక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న వందవ చిత్రమిది. క్రిష్ దర్శకుడు. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 16న కరీంనగర్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణతో పాటు చిత్ర బృందం మొత్తం హాజరవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here