కోటి ఎకరాలకు నీళ్లిస్తాం

0
19

రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిచేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని అంతర్గాం, పెద్దంపేట గ్రామాల్లో 1,350 ఎకరాల్లో సాగునీరు అందిం చే రూ.8.07 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం, గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లోని మల్లపురాణి కుంట ను రూ.2 కోట్లతో తీర్చిదిద్దిన మినీట్యాంక్ బండ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంత ర్గాం, గోదావరిఖని సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాటాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రోజులు శ్రమించి గోదావరిపై వరుస బరాజ్‌లకు రూపలక్పన చేశారన్నారు.

కాళేశ్వ రం ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో 110 కిలో మీట ర్ల పొడవునా నీళ్లు ఉంటాయన్నారు. రైతులకు సాగునీటితో పాటు మత్స్యకారులు చేపలు పెంచుకొని ఉపాధి పొందుతారన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిచేయాలని ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నాయకు లు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, కలెక్టర్ వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here