కొలంబియాలో విమాన ప్రమాదం ఐదుగురి మృతి

0
22

టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే కార్గో విమానం కూలి ఐదుగురు మృతిచెందిన సంఘటన దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో చోటుచేసుకుంది. ఒకరిని భద్రతా సిబ్బంది రక్షించారు. కొలంబియాలోని జర్మన్ ఒలానో విమానాశ్రయం నుంచి బోయింగ్ 727 కార్గో విమానం ఆరుగురి సిబ్బందితో బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకొనే సమయంలో రన్‌వే నుంచి పక్కకు వెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పైకి లేచింది. కొద్దిసేపటికే విమానాశ్రయం నుంచి 10మైళ్ల దూరంలో ఉన్న పూర్టో కారెనోలో కూలిపోయిది. సంఘటన స్థలంలోనే నలుగురు సిబ్బంది మృతిచెందారు. ఇద్దరిని భద్రతా సిబ్బంది రక్షించి దవాఖానకు తరలించగా ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందారు

LEAVE A REPLY