కొనసాగుతున్న చమురు తెట్టు తొలగింపు

0
16

చెన్నై తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో పేరుకున్న చమురు తెట్టును తొలగించే పని కొనసాగుతున్నది. జనవరి 28న గ్యాస్, చమురును తీసుకెళుతున్న రెండు రవాణా నౌకలు ఢీకొనడంతో బంగాళాఖాతంలోకి భారీస్థాయిలో చము రు ఒలికిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదిరోజులుగా తెట్టును తొలగించే పనులను వేగవంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 123 టన్నులను సిబ్బంది ద్వారా, 73 కిలోలీటర్ల తెట్టును మూడు సూపర్ సక్కర్ల ద్వారా తొలగించినట్లు అధికారవర్గాలు తెలిపా యి. తాజా అంచనాల ప్రకారం 72 కిలోమీటర్ల మేర చమురు విస్తరించినట్లు తెలుస్తున్నది.

 

LEAVE A REPLY