కొత్త రూ.500 నోటు విషయంలో బాంబు పేల్చిన ఆర్బీఐ

0
35
ఇటీవలే విడుదల చేసిన రూ.500నోట్లలో చిన్నచిన్న తప్పులు ఉన్నాయంటూ ఆర్బీఐ చావు కబురు చల్లగా చెప్పింది. అత్యవసరంగా రూ.500 నోట్లను ప్రింట్ చేయడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొంది. ఒకే డినామినేషన్‌లో రెండు రకాలుగా నోట్లు వచ్చాయని…అయితే ఆ రెండు నోట్లు చెల్లుతాయని తెలిపింది. ఈ విషయంలో కంగారపడవద్దని…ఆందోళన అవసరం లేదని ప్రజలను కోరింది. ఆర్బీఐ పంపిన నోట్లలో ఒక నోటుకు, మరో నోటుకు మధ్య తేడాలు కనిపించాయి. కొన్ని నోట్లలో గాంధీ బొమ్మ నీడలు కనిపించాయి. అలాగే జాతీయ చిహ్నం, సీరియల్ నెంబర్ అలైన్‌మెంట్లలో తేడాలు ఉన్నాయి. అయితే వీటిని మామూలుగానే ఉపయోగించవచ్చని తదుపరి నోట్లలో పొరపాట్లను సవరించుకుంటామని ఆర్బీఐ చెప్పింది.
ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు, బ్యాంకులకు రూ.500నోట్లను పంపించేసింది. రూ.500నోట్ల బార్డర్ సైజ్‌లోనూ చిన్నచిన్న తేడాలు ఉన్నట్లు గుర్తించారు. నోట్ల ముద్రణలో తేడాలుంటే దొంగనోట్లను గుర్తించడం కష్టమంటున్నారు జనం. అసలు దొంగనోట్లను అరికట్టడం సాధ్యం కాదని, పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త నోట్ల ప్రింటింగ్‌కు సన్నాహాలు చేస్తోందంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. అసలు పెద్దనోట్లు లేకుండా చేస్తేనే మంచిదని సలహా ఇస్తున్నారు.

LEAVE A REPLY