కొత్త రికార్డ్ సాధించిన మెగా హీరో

0
19

రోజులుగా వరుస ఫ్లాపులతో చతికలబడ్డ రామ్ చరణ్ తన తాజా చిత్రంతో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పుడు ఈ హీరో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న థియేటర్లలోకి రానుండగా, డిసెంబర్ 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపుకోనుంది. అయితే ఇటీవల ధృవ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ కి 5 మిలియన్ల వ్యూస్ రాగా, ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా ఈ రేంజ్ ఫీట్ సాధించలేదని చెబుతున్నారు. స్టన్నింగ్ విజువల్స్ తో పాటు రామ్ చరణ్ స్టైలిష్ లుక్, సురేందర్ రెడ్డి టేకింగ్, హిప్ హాప్ తమీజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ధృవ చిత్ర ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. తనీ ఒరువన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతి నాయకుడి పాత్రను పోషించగా, రకుల్ కథానాయికగా నటించింది. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న విషయం విదితమే

LEAVE A REPLY