కొత్త ఏడాది ప్రారంభంలోనే కోలీవుడ్‌లో సంచలనం

0
21

కొత్త ఏడాది ప్రారంభంలోనే కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తూ సీనియర్‌ నటి ఖుష్బూ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయ బోతున్నారు. ఐతే ఆమె ఈ పదవికి పోటీచేస్తున్నారని విశాల్‌ ప్రకటించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. విశాల్‌ను నిర్మాతల మండలి నుంచి తొలగించిన కారణంగానే పంతానికి ఈ పని చేస్తున్నాడని పలువురు విమర్శి స్తున్న నేపథ్యంలో… తను ఎందుకు పోటీచేస్తున్నానో ఖుష్బూ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ… ‘నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీచేయాలన్న నిర్ణయం నాదే. విశాల్‌ది కాదు. ఇతరులు ఏం మాట్లాడుతారో నాకు అనవసరం. సినీ పరిశ్రమకు మంచి జరగాలన్నదే మా అందరి ఆశయం. అందుకే నేనూ పోటీ చేయాలనుకుంటున్నాను. విశాల్‌ ఆడుతున్న ఆటలో నన్ను పావుగా చేశారని కొంతమంది భావిస్తున్నారు. నేను బాగా చదువుకున్న, లోకజ్ఞానం తెలిసిన మహిళని. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. విశాల్‌ కోసమే నేను పోటీ చేయడం లేదు’ అని కాస్త ఘాటుగానే ఖుష్బూ బదులిచ్చా రు. ఏది ఏమైనా ఇన్నాళ్లూ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి మహిళా నిర్మాత పోటీ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. పరిశ్రమలో ఆమెకు దాదాపు అందరి తోనూ స్నేహం ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఆమె విజయానికి అవకాశాలూ ఉన్నాయి.

LEAVE A REPLY